Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం..

సౌతిండియాలోనే అతిపెద్దక‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!విస్తీర్ణం: 29.37 ఎకరాలు33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లురెండు క్ల‌బ్ హౌజులు..ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌ హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది....
HomeApartments in Pocharamబాలానగర్ లో గేట్ వే హోం ల్యాండ్

బాలానగర్ లో గేట్ వే హోం ల్యాండ్

కూకట్ పల్లి వై జంక్షన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో బాలానగర్ లో గేట్ వే హోం ల్యాండ్ పేరుతో ఓ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. రఘురాం ఇన్ ఫ్రాస్టక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు లాంచ్ చేసింది. 18 ఎకరాల్లో రెండు ఫేజుల్లో దీనిని నిర్మించనున్నారు. ఫేజ్-1లో భాగంగా 12 ఎకరాల్లో 7 బ్లాకుల్లో 17 అంతస్తుల నిర్మాణం చేయనున్నారు.

అన్నీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో కూడిన 3 బీహెచ్ కే ఫ్లాట్లే. 1700 చదరపు అడుగుల నుంచి 2260 చదరపు అడుగుల్లో ఇవి ఉంటాయి. రెండు ఫేజుల్లో కలిపి దాదాపు 2వేల ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయి. ఫేజ్-1 మొత్తం 2026 డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. ఇక 95 వేల చదరపు అడుగుల్లో 35కి పైగా సౌకర్యాలతో రెండు క్లబ్ హౌస్ లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం సీ, ఐ బ్లాకుల్లో అమ్మకాలు ప్రారంభించారు. చదరపు అడుగు ధరను రూ.5,999గా నిర్ధారించారు. అంటే ఫ్లాట్ల ధర రూ.1.25 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.