Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం..

సౌతిండియాలోనే అతిపెద్దక‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!విస్తీర్ణం: 29.37 ఎకరాలు33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లురెండు క్ల‌బ్ హౌజులు..ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌ హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది....
HomeGated community flatsబహదూర్ పల్లిలో రెడీ టు మూవ్ ఫ్లాట్లు

బహదూర్ పల్లిలో రెడీ టు మూవ్ ఫ్లాట్లు

రియల్ ఎస్టేట్ రంగంలో 12 ఏళ్ల అనుభవం కలిగి, హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటివరకు 22 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన ప్రైమార్క్ సంస్థ తాజాగా మరో మూడు ప్రాజెక్టులు చేస్తోంది. వీటిలో బహదూర్ పల్లిలో ఉన్న ప్రాజెక్టు అన్నీ పూర్తి చేసుకుని రెడీ టు మూవ్ స్థితిలో ఉంది. ఐదెకరాల స్థలంలో జీ ప్లస్ 8 అంతస్తుల్లో మొత్తం ఆరు టవర్లు నిర్మించారు. అన్నింటిలో కలిపి మొత్తం 416 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు ధర కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది.

చదరపు అడుగు ధరను రూ.4,699గా నిర్ధారించారు. ఇంకా ఈ సంస్థ కొంపల్లి గుండ్లపోచంపల్లిలో ప్రైమార్క్ ఎకో నెస్ట్ పేరుతో మరో ప్రాజెక్టు లాంచ్ చేసింది. ఇక్కడ మొత్తం 410 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఐదెకరాల స్థలంలో చేపట్టే ఈ ప్రాజెక్టులో ఒక ఎకరం మొత్తాన్ని పార్కు కోసం కేటాయించారు. ఇక మియాపూర్ లో ప్రైమార్క్ మార్వెల్ ప్రాజెక్టును రెండు మూడు నెలల్లో లాంచ్ చేయబోతున్నారు. అలాగే బహదూర్ పల్లిలోనే 14 ఎకరాల స్థలంలో మరో ప్రాజెక్టు కూడా ప్రారంభించనున్నారు. ఇక్కడ 1200 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు మొదలుకానుంది.