Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం..

సౌతిండియాలోనే అతిపెద్దక‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!విస్తీర్ణం: 29.37 ఎకరాలు33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లురెండు క్ల‌బ్ హౌజులు..ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌ హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది....
HomeLuxury Apartmentsమై హోమ్ నిషధ ఆరంభం

మై హోమ్ నిషధ ఆరంభం

  • కోకాపేట్ నియోపోలిస్లో..
  • ధర.. చదరపు అడుక్కీ రూ.9600

హైదరాబాద్లో ఇంటి కొనుగోలుదారులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. దేశీయ నిర్మాణ దిగ్గజమైన మై హోమ్ గ్రూప్.. కోకాపేట్లోని నియోపోలిస్లో.. మైహోమ్ నిషధ ప్రాజెక్టును ఆరంభించింది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ ధర.. చదరపు అడుక్కీ రూ.9600గా నిర్ణయించారు. దాదాపు 16.68 ఎకరాల విస్తీర్ణంలో.. జి ప్లస్ 44 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న నిషధలో.. మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. సుమారు 1398. ఫ్లాట్ల విస్తీర్ణం.. 3450 నుంచి 4617 చదరపు అడుగుల్లో ఉంటాయి. ఎనభై శాతం ఓపెన్ స్పేస్ ఉండే నిషధలో క్లబ్ హౌజ్ ను లక్షకు పైగా చదరపు అడుగుల్లో అభివృద్ధి చేస్తారు. డబుల్ హైట్ ఎంట్రెన్స్ లాబీతో ఎనిమిది స్కై హై టవర్లను సంస్థ డిజైన్ చేసింది.

మై హోమ్ నిషధ ప్రాజెక్టు ఎలివేషన్లను ఈసారి వైవిధ్యంగా తీర్చిదిద్దారు. చూపరుల్ని ఆకట్టుకునే రీతిలో ఉండేలా డిజైన్ చేశారు. ఆకాశహర్మ్యంలో నివసించేవారి భద్రత నిమిత్తం ప్రత్యేకంగా.. ప్రతి టవర్లలో కొన్ని ఫ్లోర్లలో రెఫ్యూజీ ఏరియాలను ఏర్పాటు చేశారు. ఉదాహరణకు టవర్ 2 మరియు 7 విషయానికి వస్తే.. 17, 26, 35 మరియు 44 అంతస్తుల్లో ఇలా స్థలాన్ని కేటాయించారు. శునకాలను అమితంగా ప్రేమించేవారి కోసం ప్రత్యేకంగా పెట్ జోన్ ఏర్పాటు చే’స్తారు. సైకిళ్ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్, స్కేటింగ్ రింక్, సైకిల్ ట్రెయిల్, మల్టీపర్పస్ ప్లే కోర్ట్ వంటివి అమర్చారు. ఎంట్రెన్స్ లాబీ, క్లబ్ హౌస్, ఓపెన్ ఎమినిటీస్ వంటివి డబుల్ హైట్ లో నిర్మిస్తారు. ఇలా, ప్రతి అంశాన్ని పక్కాగా ఆలోచించి.. మై హోమ్ నిషధను సంస్థ డిజైన్ చేసింది. అందుకే, సాఫ్ట్‌ లాంచ్ ప్రకటించిందో లేదో.. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించిందని సమాచారం.