Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

అంద‌రూ మెచ్చే ఆనంద నిల‌యం..

సౌతిండియాలోనే అతిపెద్దక‌మ్యూనిటీ ఎల్‌బీ న‌గ‌ర్‌లో!విస్తీర్ణం: 29.37 ఎకరాలు33 అంత‌స్తులు.. 3,576 ఫ్లాట్లురెండు క్ల‌బ్ హౌజులు..ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట‌ హైద‌రాబాద్‌లో ఆధునిక గేటెడ్ క‌మ్యూనిటీల్లో అత్యాధునిక స‌దుపాయాల్ని ప్ర‌వేశ‌పెడుతున్న సంస్థ‌ల్లో వాస‌వి గ్రూప్ ముందంజ‌లో ఉంటుంది....
HomeReal Estateవారెవ్వా.. వాసవి అట్లాంటిస్

వారెవ్వా.. వాసవి అట్లాంటిస్

  • జోరుగా అట్లాంటిస్ పనులు
  • 2025 డిసెంబరు లోపు పూర్తి
  • 12 ఎకరాలు.. 8 టవర్లు
  • మొత్తం 2,199 ఫ్లాట్లు
  • నిర్మాణ పనుల్లో వేగం
  • సైట్ విజిట్ కి వస్తే చాలు
  • మీరే ఫ్లాట్ ఎంచుకుంటారు

హైదరాబాద్ నిర్మాణ రంగంలో వాసవి సంస్థ నిర్మిస్తున్న మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టే.. వాసవి అట్లాంటిస్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులోని మై హోమ్ అవతార్ చేరువలో దాదాపు 12 ఎకరాల్లో ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం వచ్చేవి 8 టవర్లు. సుమారు రెండు వేల రెండు వందల ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు ప్రశాంతమైన వాతావరణంలో నివసించాలని భావించేవారికి తమ అట్లాంటిస్ ప్రాజెక్టు చక్కగా నప్పుతుందని వాసవి సంస్థ చెబుతోంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు చేరువలో పని చేసేవారు.. అట్లాంటిస్ నుంచి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. నార్సింగి వద్ద ఓఆర్ఆర్ ఎక్కితే చాలు.. సులువుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. మొత్తానికి, అందరికీ అందుబాటులో ఉండేందుకు ఓ స్ట్రాటజిక్ లొకేషన్లో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టును సంస్థ డిజైన్ చేసింది.

ఫ్లాట్ల సైజుల విషయానికి వస్తే.. రెండు పడక గదుల ఫ్లాట్లు 1310 చదరపు అడుగుల నుంచి లభిస్తాయి. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 1610 నుంచి 2600 చదరపు అడుగుల్లో ఉన్నాయి. ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్లు 3030 నుంచి 3330 చదరపు అడుగుల్లో కడుతున్నారు. ఇలా, అన్ని వర్గాల వారికి నప్పేలా ఈ ప్రాజెక్టును వాసవి సంస్థ తీర్చిదిద్దింది. ఇందులో లభించని మోడ్రన్ ఫెసిలిటీ అంటూ లేదు. మినీ సినిమా థియేటర్ ను అందజేస్తున్నారు. లైబ్రరీ, బిజినెస్ సెంటర్, కాఫీ లాంజ్, రెస్టారెంట్లు, కిడ్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. వాసవి అట్లాంటిస్లో పొందుపర్చిన ఆధునిక సదుపాయాలు ఎక్కువే ఉండటం విశేషం. ఇలాంటి అనేక సదుపాయాల్ని పొందుపర్చడం వల్ల ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనేందుకు చాలామంది బయ్యర్లు ముందుకొస్తున్నారు.

కన్ స్ట్రక్షన్ స్టేటస్..

రెరా అనుమతి లభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎనిమిది టవర్లలో సగం టవర్లు పోడియం వరకూ వచ్చేశాయి. మిగతా నాలుగు టవర్లు వివిధ స్థాయిలో బేస్మెంట్ పనులు జరుగుతున్నాయి. మైవాన్ టెక్నాలజీలో నిర్మాణ పనులు చేస్తున్నారు కాబట్టి.. గ్రౌండ్ నుంచి పైవరకూ ఫ్లోర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. మొత్తానికి, 2025 డిసెంబరులోపు వాసవి అట్లాంటిస్ ను కొనుగోలుదారులకు అందించాలన్న లక్ష్యంతో వాసవి సంస్థ ముందుకు దూసుకెళుతోంది. మరి, ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో నివసించాలన్న నిర్ణయానికి మీరు వస్తే.. వెంటనే వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టుకు విచ్చేయండి మీకు నచ్చిన గృహాన్ని ఎంచుకోండి.